Wednesday, 17 June 2026 02:44:22 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

తెలంగాణ ప్రజలకు అలెర్ట్..

Date : 06 April 2026 10:46 AM Views : 36

DNB News - ఆంధ్రప్రదేశ్ / : హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు బిగ్ అలెర్ట్..రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఎండల ప్రభావం ఉన్నా.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో 41 డిగ్రీల మార్క్ ను దాటేశాయి. శనివారం నల్గొండ జిల్లా మాడ్గులపల్లిలో అత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 14 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా రికార్డు అయింది. హైదరాబాద్‌లోనూ ఎండలు దంచికొడుతున్నాయి. 38.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఎండలతోపాటు ఉక్కపోత కూడా ఎక్కువైంది. అయితే, ఇదే సమయంలో వర్షాలు కూడా పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఐఎండీ అంచనా ప్రకారం.. తొలి రెండు రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆ తరువాత రెండు రోజులకు దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలకు ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. బలమైన ఈదురుగాలులు, 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు పడే సమయంలో ఈదురుగాలులు వీచే సమయంలో సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. హైదరాబాద్ లో ఒక పక్క ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ వర్షాలు పడే చాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం వేళల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. రైతులు రబీలో సాగుచేసిన పంటలు ప్రస్తుతం చేతికందే దశలో ఉన్నాయి. పలు ప్రాంతాల్లో పంట ఉత్పత్తులు కల్లాల్లో ఆరబోశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలతో రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వరి, మొక్కజొన్న, మిరప తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కురిసన వర్షాల కారణంగా రైతులు సాగుచేసిన పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :