DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని జేబీ గార్డెన్‌లో నిర్వహించిన బీజేపీ జిల్లా స్థాయి సమావేశంలో వైసీపీ నాయకుడు గోల్డ్ రమేష్ బీజేపీ పార్టీలో చేరారు. ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా గోల్డ్ రమేష్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీ పార్టీలో కష్టపడి పనిచేసినప్పటికీ తనకు కనీస గౌరవం కూడా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ నగర్ వార్డు అభివృద్ధి కోసం డాక్టర్ పార్థసారథి వాల్మీకి నాయకత్వాన్ని బలపరచాలని నిర్ణయించుకుని, అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన దాదాపు 300 కుటుంబాలతో కలిసి వైసీపీని వీడి బీజేపీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోల్డ్ రమేష్‌తో పాటు బొబ్బిలి వీరేష్ మరియు పలువురు కార్యకర్తలు కూడా బీజేపీలో చేరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కొత్తగా చేరిన వారిని స్వాగతించి అభినందించారు.
Admin
DNB News