Monday, 15 June 2026 02:25:13 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

పట్టుదలతో పతకాల వర్షం… అంతర్జాతీయ వేదికపై ఆదోని మహిళల ఘనత...

Date : 28 April 2026 11:35 AM Views : 75

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రతిభ, పట్టుదల ఉంటే వయసుతో సంబంధం లేకుండా ప్రపంచాన్ని జయించవచ్చని అదోని పట్టణానికి చెందిన ఇద్దరు మహిళా క్రీడాకారిణులు నిరూపించారు. థాయిలాండ్ వేదికగా ఏప్రిల్ 17 నుండి 20 వరకు జరిగిన వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొన్న శ్రీమతి నీలం భండారి మరియు శ్రీమతి హరిత కుమారి అద్భుత ప్రదర్శనతో భారతదేశానికి పలు పతకాలు అందించారు. పట్టుదలతో శిఖరాలకు… శ్రీమతి నీలం భండారి: గత పదేళ్లుగా మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో నిరంతర సాధనతో ముందుకు సాగుతూ, అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుతున్నారు. మూడు సార్లు అంతర్జాతీయ, ఎనిమిది సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని, మొత్తం 35 పతకాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు. శ్రీమతి హరిత కుమారి: అదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో టైపిస్ట్‌గా పనిచేస్తూ, గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే క్రీడలపై ఆసక్తిని కొనసాగించారు. పిల్లలు పెద్దవారైన తర్వాత మళ్లీ క్రీడల్లోకి అడుగుపెట్టి, ఈ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచారు. సాధించిన పతకాలు: నీలం భండారి: షాట్‌పుట్ (వెండి), 100 మీటర్ల స్ప్రింట్ (వెండి), 2 కి.మీ వాక్ (కాంస్యం) హరిత కుమారి: డిస్కస్ త్రో (స్వర్ణం), 100 మీటర్ల స్ప్రింట్ (స్వర్ణం), 2 కి.మీ వాక్ (వెండి) అంతర్జాతీయ క్రీడల వేదికపై భారత జాతీయ పతాకాన్ని గర్వంగా ఎగరవేసిన ఈ ఇద్దరు క్రీడాకారిణులు తమ విజయానికి కఠిన సాధనే కారణమని తెలిపారు. వారి విజయంపై పలువురు ప్రముఖులు, క్రీడాభిమానులు అభినందనలు తెలిపారు. సాధారణ మహిళలు కూడా పట్టుదలతో అసాధారణ విజయాలు సాధించగలరని ఆదోని క్రీడాకారిణులు మరొక్కసారి నిరూపించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :