DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని జిల్లా ఏర్పాటు లక్ష్యంగా సిపిఐ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, ఈ అంశంపై పార్టీ కట్టుబడి ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కే. రామాంజనేయులు తెలిపారు. ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఇటీవల ఆదోని జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తున్న నాయకుల శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల న్యాయమైన ఆకాంక్ష అయిన ఆదోని జిల్లా ఏర్పాటు కోసం సిపిఐ పార్టీ అన్ని స్థాయిల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుదర్శన్, సిపిఐ మండల కార్యదర్శి కల్లుబావిరాజు, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి లక్ష్మీనారాయణ, రమేష్ కుమార్, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి అంజిత్ గౌడ్, నాయకులు రాము గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News