Monday, 15 June 2026 02:25:10 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

కామ్రేడ్ గోరుకల్లు అయ్యప్ప గౌడ్ 5వ వర్ధంతి ఘనంగా నిర్వహణ..

Date : 30 April 2026 11:14 AM Views : 42

DNB News - ఆంధ్రప్రదేశ్ / : భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) స్థానిక బుడెక్కల్ కార్యాలయంలో 29-04-2026 న మధ్యాహ్నం 12 గంటలకు కీర్తిశేషులు కామ్రేడ్ గోరుకల్లు అయ్యప్ప గౌడ్ 5వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆదోని నియోజకవర్గ అధ్యక్షుడు బసాపురం గోపాల్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా CPI జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. సుదర్శన్, CPI పట్టణ కార్యదర్శి టి. వీరేష్, CPI మండల టూ కార్యదర్శి బిజి ఎల్లప్ప, AIYF పట్టణ కార్యదర్శి గోరుకల్లు అంజిత్ గౌడ్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ కామ్రేడ్ అయ్యప్ప గౌడ్ పేదల కోసం, భూమిలేని నిరుపేదల కోసం జీవితాంతం పోరాడిన మహానేత అని కొనియాడారు. దొడ్డనకేరి గ్రామంలో తన సొంత భూములను కూడా నిరుపేదలకు పంచిన త్యాగమూర్తి అని గుర్తుచేశారు. అలాగే CPI తరపున ఎంపీటీసీగా గెలుపొందడం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా బాధ్యుడిగా, CPI పట్టణ కార్యదర్శిగా, జిల్లా కార్యవర్గ సభ్యునిగా సేవలందించడం వంటి అంశాలను ప్రస్తావించారు. ఆయన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను సాధించే దిశగా పనిచేస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోరుకల్లు కృష్ణమూర్తి, DHPS కార్యదర్శి విజయ్, పుష్పరాజు, రాము, దొడ్డనకేరి ఉరుకుందు, మండిగిరి శేషప్ప, అస్లాం భాష, ఉదయ్ కిరణ్ యాదవ్, శశి తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :