Monday, 15 June 2026 01:43:57 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

కర్నూలులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలకు శ్రీకారం

Date : 02 March 2026 12:22 PM Views : 69

DNB News - ఆంధ్రప్రదేశ్ / : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న వారోత్సవాలను కర్నూలు అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్త పర్యవేక్షణలో, కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ , కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఆదివారం ఈ వారోత్సవాలు ప్రారంభించినట్లు తెలిపారు. మార్చి 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా సాధికారత, మహిళల భద్రతపై అవగాహన కల్పించేందుకు మహిళా పోలీసు విభాగం ఆధ్వర్యంలో ర్యాలీలు మరియు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వారాంతర కార్యక్రమాలలో భాగంగా విద్యార్థులు, మహిళలతో కలిసి మహిళా సాధికారత, భద్రత అంశాలపై అవగాహన ర్యాలీలు, అవగాహన సదస్సులు, పెయింటింగ్, డ్రాయింగ్, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు, హెల్త్ క్యాంపులు, ఓపెన్ హౌస్ కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, బ్యాండ్ షోలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. మహిళలు, విద్యార్థులు, చిన్నారులు ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని చదువులో ముందుకు సాగాలని సూచించారు. మహిళల పట్టుదల, ఆత్మవిశ్వాసం సమాజ ప్రగతికి బలమైన పునాది అని పేర్కొన్నారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే సమీప పోలీస్ స్టేషన్‌ను లేదా డయల్ 112, చైల్డ్ లైన్ 1098, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ అవగాహన ర్యాలీ కర్నూలులోని కొండా రెడ్డి బురుజు వద్ద ప్రారంభమై కోల్స్ కళాశాల మీదుగా పాత కంట్రోల్ రూమ్ వరకు, అక్కడి నుండి తిరిగి జిల్లా పోలీసు కార్యాలయం వరకు కొనసాగింది. “ఆకతాయిల ఆట కట్టిస్తాం – తిరుగుబోతుల తాట తీస్తాం”, “ఒంటరిగా ప్రయాణిస్తున్నారా? శక్తి యాప్ ఉపయోగించండి” వంటి నినాదాలతో ఫ్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, మహిళా పోలీస్ స్టేషన్ సీఐలు రామయ్య నాయుడు, విజయలక్ష్మి, పట్టణ సీఐలు పార్థసారథి, నాగరాజా రావు, మన్సురుద్దీన్, ఆర్‌ఐలు నారాయణ, జావేద్, ఆర్‌ఎస్‌ఐలు, శక్తి టీం మహిళా పోలీసులు, సచివాలయ పోలీసులు, శ్రీలక్ష్మి, చైతన్య, కెవిఆర్ కళాశాల, సిరాక్ స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :