DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని నియోజకవర్గం పరిధిలోని వీవోఏ లకు ఎమ్మెల్యే పార్థసారథి చేతుల మీదుగా 5జీ స్మార్ట్ ఫోన్లను అందజేసే కార్యక్రమం ఏపీఎం వీరన్న అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో మహిళలకు సమర్థంగా అందజేయడంలో వీవోఏ లు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. వారికి సాంకేతిక సదుపాయాలు కల్పించడం ద్వారా సేవలు మరింత వేగవంతం అవుతాయని తెలిపారు. వీవోఏలకు స్మార్ట్ ఫోన్లు అందజేయడం అభినందనీయమైన చర్య అని అన్నారు. అదేవిధంగా, బ్యాంకు లింకేజీలు, శ్రీనిధి, ఉన్నతి వంటి రుణ పథకాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి లక్షాధికారులుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు గుడిసె కృష్ణమ్మ, రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ, పంపాపతి, కపటి రాజు, ఉషా రాజు, వెలుగు సిబ్బంది మరియు ఇతరులు పాల్గొన్నారు.
Admin
DNB News