DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రజల బాధను తన బాధగా భావించే ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన నిలుస్తోందనడానికి నిదర్శనంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణీ కార్యక్రమం ఆదోని నియోజకవర్గంలో జరిగింది. ఆదోని శాసనసభ్యులు డా. పార్థసారధి తమ క్యాంపు కార్యాలయంలో 34 మంది లబ్ధిదారులకు రూ.14,45,291/- విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణీ చేశారు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేద కుటుంబాలకు ఈ సహాయం ఒక ఆశాకిరణంగా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. పార్థసారధి మాట్లాడుతూ, ప్రజల కష్ట సమయంలో ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవడమే నిజమైన పాలన అని పేర్కొన్నారు. పేదలకు వైద్యం అందక ప్రాణాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిరంతరం సహాయం అందిస్తున్నారని తెలిపారు. ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఈ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వంలో ప్రతి అర్హుడికి న్యాయం జరుగుతుందని, భవిష్యత్తులో కూడా ఆదోని ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Admin
DNB News