DNB News - ఆంధ్రప్రదేశ్ / : తిరుపతి నందు జరిగిన విద్యార్థి నాయకుల కిడ్నాప్ ను తీవ్రంగా తీసుకున్న జిల్లా యస్పీ శ్రీ సుబ్బరాయుడు, ఐపీఎస్., సంఘటన జరిగిన వెంటనే అడిషనల్ యస్పీ శ్రీ రవి మనోహర చారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు. గంట వ్యవధి లో కిడ్నాప్ కాబడిన విదార్థి సంఘం నాయకులు అక్బర్ మరియు వినోద్ లను రక్షించిన పోలీసులు. కిడ్నాప్ చేసిన వారి తో పాటు వాహనాలు కూడా అదుపులోకి తీసుకొన్న పోలీసులు. కిడ్నాప్ చేసిన వారితో పాటు చేయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు సమగ్రమైన దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదు.
Admin
DNB News