DNB News - ఆంధ్రప్రదేశ్ / : నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్ గల చారిత్రక పాఠశాల నందు నిన్న జరిగిన సంఘటన ఆందోళనకారం అని వామపక్ష విద్యార్థి సంఘాలు నాయకులు విమర్శించారు. ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో ఆర్స్ కాలేజ్ పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా AISF, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ షాబీర్ భాష, SFI, పట్టణ కార్యదర్శి శశిధర్,PDUS, జిల్లా అధ్యక్షుడు అఖండ లు మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రభుత్వ పాఠశాలలో అత్యంత ఎక్కువ అడ్మిషన్ కలిగిన పాఠశాల నెహ్రూ మెమోరియల్ మునిసిపల్ హై స్కూల్ ఈ విద్యాసంవత్సరం మొదట్లోనే నో అడ్మిషన్స్ బోర్డును పెట్టి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రశంసలు అందుకున్నటువంటి చారిత్రక పాఠశాలలో నిజానిజాలు తెలుసుకోకుండా పాఠశాల ఆవరణంలో మత కోణం లో ఆందోళన చెప్పటి కుల, మతాలు కు అతితంగా విజ్ఞానం ఆస్వాదించే పిల్లలు మధ్య చేయడం సరైనది కాదని వారు అన్నారు. స్వయంగా స్వామి మాల వేసిన విద్యార్థి తల్లి స్పష్టంగా తన కుమారుడు పాఠశాల కు రాలేదని తెలుసుకొని భాద పడుతూ హెడ్ మాస్టర్ మందాలించాడానీ ఎవరు తప్పు పట్టాల్సిన పని లేదని చెప్పింది అని, నిజానిజాలు తెలుసుకోకుండా ఆ విద్యార్థి సమస్య ను తెలుసుకొని 10 వ తరగతి పాస్ ఐయ్యే విధంగా ప్రోత్సహించి భవిష్యత్తు ను కాపాడేలా చేయాల్సింది పోయి, చదువులు చెప్పే ఉపాధ్యాయులు పైఇబ్బంది పెట్టడం సరికాదు అని, వెంటనే అధికారులు స్పందించి ఇలాంటి వాతావరణం ను అరికట్టి విద్యార్థులు చదువులు, వారి ఐక్యత ను కాపాడాలని వారు డిమాండ్ చేసారు. పాఠశాల లో మతాలకంటే మానవత్వం ను పెంపొందించే విధంగా కృషి చేయాలనీ, ఇలాంటి కార్యక్రమాలకు వామపక్ష విద్యార్థి సంఘాలు ముందు ఉంటాయని వారు తెలిపారు అనంతరం ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్ష ,కార్యదర్శి, బి . శ్రీకాంత్, యు.దాస్తగిరి, పట్టణ సహాయ కార్యదర్శి యు.మోహన్ ఎస్ఎఫ్ఐ నాయకులు ఉమాకాంత్, నాగరాజు, పి డి ఎస్ య నాయకులు , బసవ రాజ్, మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News