DNB News - ఆంధ్రప్రదేశ్ / : విజయ్‌కు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ.. తనకు విడాకులు ఇవ్వాలని ఆయన భార్య సంగీత ఇటీవల కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. అయితే.. భార్య కోర్టును ఆశ్రయించిన కొద్ది రోజులకే విజయ్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. భార్య ఆరోపణలు చేసిన అదే నటి త్రిషతో కలిసి విజయ్ తాజాగా ఒక శుభకార్యానికి హాజరయ్యారు. ఇద్దరూ ఒకే కారులో కార్యక్రమానికి చేరుకుని.. అక్కడ చాలా సన్నిహితంగా కనిపించినట్లు సమాచారం. ఫంక్షన్‌లో కొత్త దంపతులను కలిసి ఆశీర్వదించిన ఈ జంట.. దంపతుల మాదిరిగా కనిపించడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ వ్యక్తిగత జీవితం చుట్టూ మరోసారి చర్చలు మొదలయ్యాయి.
Admin
DNB News