DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని జిల్లా సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని జేఏసీ నాయకుడు నూర్ అహ్మద్ పిలుపునిచ్చారు. మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆదోని జిల్లాను సాధించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఈ నెల 24న ఐదు నియోజకవర్గాల్లో స్వచ్ఛందంగా బంద్ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదోని జిల్లా ఏర్పాటుతో ప్రాంతాభివృద్ధి, విద్యా, వైద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని కోరారు. బంద్ సందర్భంగా శాంతియుతంగా నిరసనలు తెలియజేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నూర్ సూచించారు.
Admin
DNB News