DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా మంత్రాలయం పరిధిలో పేకాట శిబిరంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి 10 మందిని అరెస్ట్ చేశారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, మంత్రాలయం సీఐ రామాంజనేయులు పర్యవేక్షణలో మాధవరం ఎస్సై విజయ్ తన పోలీసు సిబ్బందితో కలిసి సింగరాజనహళ్లి గ్రామ శివారులో జూదం నిర్వహిస్తున్నారనే సమాచారంతో దాడులు చేపట్టారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.41 లక్షల నగదు, 52 ప్లేయింగ్ కార్డులు మరియు 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Admin
DNB News