Monday, 15 June 2026 01:48:02 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత ముందుకు రావాలి...PDSU తో పిలుపు..

మతోన్మాద వ్యతిరేక పోరాటమే భగత్ సింగ్‌కు నిజమైన నివాళ..పీడీఎస్‌యూ..

Date : 24 March 2026 10:27 AM Views : 54

DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాయలసీమ విశ్వవిద్యాలయంలో కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌ల 95వ వర్ధంతి సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు కె. భాస్కర్, జిల్లా ఉపాధ్యక్షులు రమణ కుమార్ పాల్గొన్నారు. ముందుగా అమర వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌ల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సామ్యవాదం, లౌకికవాదం, సమసమాజ స్థాపన కోసం వారు కలలు కనారని, వారి ఆశయాలు నేటి యువతకు మార్గదర్శకమని అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా యుక్త వయస్సులోనే ప్రాణత్యాగం చేసిన వీరుల సాహసం అపూర్వమని కొనియాడారు. నేటి యువత మాదక ద్రవ్యాలకు బానిసలవుతూ సామాజిక సమస్యలపై స్పందన కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులపై యువత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధ చర్యలను ఖండిస్తూ నిరపరాధ ప్రజలపై దాడులు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు వ్యవసాయ రంగానికి హానికరమని విమర్శించారు. యూజీసీ 2026 ముసాయిదాను అమలు చేయాలని, సుప్రీంకోర్టు స్టేను ఎత్తివేయాలని కోరారు. రాష్ట్రంలో యూనివర్సిటీల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, ఖాళీగా ఉన్న 4200 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను విమర్శిస్తూ, అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షకు పైగా పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే యువత మతోన్మాద, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ నాయకులు సుధాకర్, సాయి, పవన్, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :