DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆముదాలవలస నియోజకవర్గంలో 2022-2023 కాలంలో పిడుగుపాటు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు అప్పటి వైసిపి ప్రభుత్వం ఎగ్గొడితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధితులు తరపున ఎమ్మెల్యే గారు సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి ఎంతో కృషిచేసి బాధితులందరికీ న్యాయం చేసే దిశగా పని చేసి నాలుగు లక్షల రూపాయలు సహాయంగా ఎక్స్‌గ్రేషియా “నేచురల్ కాలమిటీస్ – థండర్‌బోల్ట్ డెత్ ఎక్స్‌గ్రేషియా” కింద బాధితుల వివరాలను నమోదు చేసి ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు పంపించారు. లబ్ధిదారులు వివరాలు... 1. చోడవరపు వెంకట సత్యనారాయణ-అయ్యవారిపేట (బూర్జ మండలం) 2. బురాడ అప్పలనాయుడు-బుడ్డి వలస (సరుబుజ్జిలి మండలం) 3. దాసరి అప్పన్న-పాలవలస (సరుబుజ్జిలి మండలం) మరణించిన కుటుంబ సభ్యుల నుంచి అవసరమైన ధృవీకరణలు, వేలిముద్రలు తీసుకుని ఎక్స్‌గ్రేషియా మంజూరు చేశారు. ప్రభుత్వం తరఫున అందించే సహాయం బాధిత కుటుంబాలకు నేరుగా వారు అకౌంట్లోనే జమ చేయడం జరుగుతుందని తెలిపారు. లబ్ధిదారుల కుటుంబాలు గౌరవ ఎమ్మెల్యే రవికుమార్ మరియు సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు.
Admin
DNB News