DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ వి. వెంకట బసవరావు ని డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (డీఎస్ఎఫ్) నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. బ్లాక్ టీచింగ్ నిర్వహించకుండా, అవసరమైన సౌకర్యాలు కల్పించకుండా కొన్ని బీఈడీ కళాశాలలు నడుపుతున్నాయని, అలాంటి కళాశాలలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ డిమాండ్ చేశారు. సౌకర్యాలు లేని కళాశాలలకు గుర్తింపు అవసరం లేదని, ధనార్జనే ధ్యేయంగా ఫీజులు వేలకు వేలు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బ్లాక్ టీచింగ్ నిర్వహించకుండా కళాశాలలు ఎలా నడుస్తున్నాయో ఉన్నతాధికారులు పరిశీలించాలని కోరారు. అటువంటి బీఈడీ కళాశాలలపై తక్షణ చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో కళాశాలల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. దీనిపై స్పందించిన వైస్ చాన్స్‌లర్ వి. వెంకట బసవరావు సంబంధిత కళాశాలలపై తక్షణ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Admin
DNB News