DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని నియోజకవర్గంలో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం కార్యకర్తలు కలిసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు వైసీపీ పాలనను గుర్తుంచుకున్నారని, 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
DNB News