Tuesday, 28 April 2026 02:59:31 PM
# దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ అధినేతకు పితృ వియోగం.. # రాత్రి వేళల్లో కర్నూలులో కట్టుదిట్టమైన పోలీసింగ్ – ప్రజల భద్రతే లక్ష్యం.. # కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ఆగ్రహం – తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్... # పట్టుదలతో పతకాల వర్షం… అంతర్జాతీయ వేదికపై ఆదోని మహిళల ఘనత... # మండల వ్యాప్తంగాఘనంగా గులాబీ జెండా రెపరెపలుబీఆర్ఎస్ పార్టీఆవిర్భావ దినోత్సవ వేడుకలు # ఆదోని జిల్లా కోసం 163వ రోజు దీక్ష – హామీ కోసం జేఏసీ ఆగ్రహం.. # పొరంబోకు భూమిపై రాజకీయ గేమ్… హెచ్చరిక బోర్డు ధ్వంసం కలకలం.. # 121 ఫిర్యాదుల స్వీకరణ – చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తాం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ # పెట్రోల్, డీజిల్ కొరత లేదు – ఆందోళన వద్దు, అదనపు కొనుగోళ్లు చేయొద్దు: కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక.. # ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం సామాన్య ప్రజలు బారులు తీరడం # టిఆర్ఎస్ జండా ఆవిష్కరణ # హిందూధర్మం అంటే మతం కాదు, జీవన విధానం. .. # జై వడ్డె ఓబన్న జై వడ్డెర # వైసీపీకి భారి షాక్ – బీజేపీలోకి 30 కుటుంబాల ఘన చేరిక.. # కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం # భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ # నిజం చెప్పడం వల్ల అసౌకర్యం కలిగినా బాధ్యతతో వ్యవహరించాలి – సీనియర్ జర్నలిస్టు మగ్ధుం భాష... # హరీశ్ రావు ని శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామస్థుల ఆహ్వానం # ఆదోని భూ మోసం బహిర్గతం – బాధితులకు న్యాయం కోసం పోరాటం.. గుడిసె కృష్ణమ్మ # కర్నూలు ఎస్పీని కలిసిన నూతన సివిల్ జడ్జి మహమ్మద్ అజామ్ – అభినందనలు తెలిపిన విక్రాంత్ పాటిల్..

ఆదోని జిల్లా కోసం 163వ రోజు దీక్ష – హామీ కోసం జేఏసీ ఆగ్రహం..

Date : 28 April 2026 10:12 AM Views : 9

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని జిల్లా సమస్యను పక్కనపెట్టి పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడుతున్నారని పాలక, ప్రతిపక్ష నాయకులపై ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదోని జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు సోమవారం 163వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు దీక్షలో రామాంజనేయులు, వై. యాంకోబా, అనువాల పాండురంగ, రామకృష్ణ, బసాపురం మల్లయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు దాసరి గోవిందురాజులు, సుజ్ఞానమ్మ మాట్లాడుతూ, ఆదోని కూటమి ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి అసెంబ్లీలో ఆదోని జిల్లా అంశంపై మాట్లాడినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే 163 రోజులుగా కొనసాగుతున్న దీక్షల నేపథ్యంలో ఇప్పటికీ స్పష్టమైన హామీ రాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పార్థసారథి చొరవ తీసుకుంటే కేంద్ర, రాష్ట్ర స్థాయిలో హామీ తీసుకురావడం సాధ్యమేనని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి ఆదోని జిల్లాపై స్పష్టమైన ప్రకటన తీసుకురావాలని డిమాండ్ చేశారు. గత 70 ఏళ్లుగా ఆదోని అభివృద్ధి చెందకపోవడంతో ప్రజలు మార్పు కోసం కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టాలని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పగడాల కోదండ, వైపీ నాగరాజు, బండారి హనుమంతు, గుమ్మల బాలస్వామి, మాదాసు జగన్, దాసరి నరేష్, బీఎస్పీ రామలింగయ్య తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: