Wednesday, 17 June 2026 02:32:46 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఏపీడీపీఎంఎస్ 2.0తో భవన నిర్మాణ అనుమతులు మరింత సులభం..

Date : 12 May 2026 10:27 AM Views : 33

DNB News - ఆంధ్రప్రదేశ్ / : భవన నిర్మాణాలు, లేఅవుట్లకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. సోమవారం స్థానిక ఎస్‌బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన పురపాలక, నగరపాలక సంస్థల ప్రణాళికా సిబ్బంది, లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్లకు ఏపీ పట్టణాభివృద్ధి శాఖ ప్రవేశపెట్టిన ఏపీడీపీఎంఎస్ 2.0 ఆన్లైన్ విధానంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడీపీఎంఎస్ సాఫ్ట్‌టెక్ డైరెక్టర్ సంధ్యా, మూర్తి, సంజయ్ బృందం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కొత్త విధానంలోని ముఖ్యాంశాలను విపులంగా వివరించారు. తాజా ఆన్లైన్ విధానం ద్వారా ఇళ్లు, అపార్ట్మెంట్లు, వాణిజ్య భవనాల నిర్మాణాలకు సంబంధించిన అనుమతులను సులభంగా దరఖాస్తు చేసి వేగంగా పొందవచ్చని తెలిపారు. అలాగే భూములను ప్లాట్లుగా విభజించి విక్రయించేందుకు అవసరమైన లేఅవుట్ అనుమతులను కూడా ఆన్లైన్ ద్వారానే పొందే విధంగా వ్యవస్థను రూపొందించినట్లు వివరించారు. కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ.. ఏపీడీపీఎంఎస్ 2.0 ద్వారా నిర్మాణ, లేఅవుట్ అనుమతుల జారీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగవంతంగా మారిందన్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు నుంచి అనుమతి వరకు అన్ని సేవలను పొందవచ్చన్నారు. ఈ విధానం ద్వారా సమయం ఆదా కావడంతో పాటు సేవల నాణ్యత కూడా మెరుగుపడుతుందన్నారు. కార్యక్రమంలో అనంతపురం ప్రాంతీయ సంచాలకులు కెఎండీ ఇసాక్, ఇంచార్జి సిటీ ప్లానర్ వై.వి. వెంకటరమణ, కుడా పీఓలు బి. విజయ్ భాస్కర్, యూ. మోహన్ కుమార్, ఏపీడీపీఎంఎస్ సాఫ్ట్‌టెక్ డైరెక్టర్ సంధ్యా, క్రెడాయ్ చైర్మన్ గోరంట్ల రమణ, క్రెడాయ్ అధ్యక్షుడు జె. సురేష్ కుమార్, లెస్సా చైర్మన్ మురళీ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: