DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ ను ఆదోని సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు అత్యవసర సహాయం అందించే ఉమెన్ హెల్ప్ లైన్ – 181 మరియు పిల్లల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చైల్డ్ హెల్ప్ లైన్ – 1098 సేవలకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. మహిళలు, పిల్లలు ఎదుర్కొనే అత్యవసర పరిస్థితుల్లో వన్ స్టాప్ సెంటర్ ద్వారా తక్షణ సహాయం, న్యాయ సలహాలు, వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ, ఇతర శాఖల అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
DNB News