DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా సమాజానికి అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా పలువురు ప్రముఖులకు జిల్లా యంత్రాంగం ఉత్తమ సేవా పురస్కారాలను అందజేసింది. ఆదోని డివిజన్ వినియోగదారుల రక్షణ మండలి అధ్యక్షులు మరియు సీనియర్ జర్నలిస్ట్ ఈసా బాషా సామాజిక సేవలకు గాను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అవార్డు ప్రదానం చేసిన జిల్లా కలెక్టర్ జి. సిరి ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్,ఐఏఎస్, మరియు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అనంతరం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, తదితర అధికారులు సందర్శించారు.పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి రాజా రఘువీర్, స్టాల్‌లో ప్రదర్శించిన వివిధ రకాల బియ్యం, నిత్యావసర వస్తువుల పంపిణీ విధానం మరియు ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన సాంకేతికత గురించి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మరియు ఎస్పీలకు వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అనంతరం జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం కార్యాలయంలో జిల్లా వినియోగదారుల రక్షణ మండలి అధ్యక్షుడు నదీం హుసేన్ అవార్డు అందుకున్న ఈసా భాషా కు శుభాకాంక్షలు తెలియ జేశారు.
Admin
DNB News