DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన కమ్మరి పద్మావతిని బీజేపీ కర్నూల్ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా నియమించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా నియమించిన పార్టీ పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ కి, జిల్లా మహిళా అధ్యక్షురాలు వెంకట సుజాత కి, మాలతీ కి, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ మురళి నాయుడు కి, జిల్లా నాయకులు గురురాజ్ దేశాయ్ కి, ఎమ్మిగనూరు పట్టణ అధ్యక్షులు దయాసాగర్ కి ఆమె ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, మహిళలను మరింతగా రాజకీయాల్లోకి తీసుకురావడానికి కృషి చేస్తానని పద్మావతి తెలిపారు.
Admin
DNB News