DNB News - ఆంధ్రప్రదేశ్ / : వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అక్షరాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా కృష్ణగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అక్షరాభ్యాస శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి సందర్శించారు. ఈ సందర్భంగా శిబిరంలో పాల్గొంటున్న అభ్యాసకులతో మాట్లాడి, వారి చదువు పురోగతిని స్వయంగా పరిశీలించారు. అభ్యాసకుల చదవడం, వ్రాయడం నైపుణ్యాలను పరీక్షించి, మరింత మెరుగైన ఫలితాల కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. వయోజనులకు అక్షరాస్యత కల్పించడం ద్వారా వారి జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వయోజన విద్యా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
DNB News