Wednesday, 17 June 2026 02:49:29 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

కూన రవికుమార్ పట్టుదలతో ఆమదాలవలస పట్టణంలో మరో ప్రతిష్టాత్మక విద్యుత్ ప్రాజెక్ట్

Date : 30 January 2026 12:19 PM Views : 133

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆముదాలవలస నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ మాటల్లో కాకుండా అభివృద్ధిని చేతల్లో చూపిస్తున్న కూన రవికుమార్ ని అభినందిస్తున్న నియోజకవర్గ ప్రజలు జగ్గుశాస్త్రులు పేటలో రూ .3.86 కోట్లతో 33/11 కేవీ కొత్త ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ మంజూరు ఎమ్మెల్యే కూన రవికుమార్ విశేష కృషికి ఫలితం ఆముదాలవలస నియోజకవర్గంలోని ఆమదాలవలస మున్సిపాలిటీలో జగ్గుశాస్త్రులు పేట గ్రామంలో 33/11 కేవీ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 కోట్ల 86 లక్షలు మంజూరు చేసింది. ఈ సబ్ స్టేషన్ నిర్మాణంతో పరిసర గ్రామాల ప్రజలకు నిరంతరాయంగా, ఆటంకం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానుంది.ఈ కీలకమైన సబ్ స్టేషన్ మంజూరుకు ఆముదాలవలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ నిరంతరం చేసిన కృషే కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. గత కొంతకాలంగా విద్యుత్ లోపాల కారణంగా రైతులు, పరిశ్రమలు, గృహ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ సబ్ స్టేషన్ శాశ్వత పరిష్కారంగా నిలవనుంది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ,“ఈ ప్రాంతంలో విస్తారంగా డ్రై ల్యాండ్స్ ఉండటం వల్ల పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు అనుకూల వాతావరణం ఉంది. తక్కువ పెట్టుబడితోనే పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన విద్యుత్ లభించనుంది. దీని ద్వారా పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ముఖ్యంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి” అని తెలిపారు.సబ్ స్టేషన్ నిర్మాణంతో వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, వాణిజ్య రంగం మరింత బలోపేతం కావడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించనుంది. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి కారణమైన ఎమ్మెల్యే కూన రవికుమార్ కృషిని జగ్గుశాస్త్రులు పేటతో పాటు పరిసర గ్రామాల ప్రజలు హర్షాతిరేకాలతో అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :