DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్ర సచివాలయం నుండి సిసిఎల్ఏ (Chief Commissioner of Land Administration) జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కర్నూలు జిల్లా నుండి జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో భూవివాదాలు, రెవెన్యూ సంబంధిత అంశాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, పెండింగ్ కేసుల పరిష్కారం, భూ రికార్డుల అప్‌డేషన్ తదితర కీలక అంశాలపై సమీక్ష జరిగింది. జిల్లాలో రెవెన్యూ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్ణీత గడువుల్లో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులకు సూచించారు.
Admin
DNB News