DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆమదాలవలస, ఏప్రిల్ 6 : ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించిన వైయస్సార్ పార్టీ యువ నాయకులు తమ్మినేని చిరంజీవి నాగ్ ఆమదాలవలస మండలం రామచంద్రపురం మాజీ సర్పంచ్ ఇప్పిలి సూర్యారావు ఇటీవల మృతి చెందారు.కొత్తవలస గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త గురుగుబెల్లి పెంటయ్య ఇటీవల మృతి చెందారు అదే విధంగా సరుబుజ్జిలి మండలం మూల సవాలపురం పంచాయతీ పరిధిలోని వ్యాసులపేట గ్రామంలో బెండి అప్పల నరసింహులు ఇటీవల మృతి చెందారు ఆయా కుటుంబాలను సోమవారం యువ నాయకులు తమ్మినేని చిరంజీవి నాగ్ పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు ఆ కుటుంబాలను వాదార్చి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
DNB News