DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని మండలం కుప్పగల్ గ్రామంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నుండి బీజేపీలోకి చేరిన మాజీ సర్పంచ్ నాగిరెడ్డి మరియు ఆయన కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దాడిలో టిడిపి నాయకులు షణ్ముఖ, శేఖర్, తిక్కస్వామి గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరికి తలకు తీవ్ర గాయం కాగా, మరో నాయకుడు శేఖర్‌పై దాడి జరగడంతో ఆయనకు గుండె సంబంధిత సమస్య తలెత్తినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన విషయం తెలుసుకున్న వెంటనే టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, యువ నాయకులు భూపాల్ చౌదరి హాస్పిటల్‌కు చేరుకుని గాయపడిన వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. మాజీ శాసనసభ్యులు, ఆదోని టిడిపి ఇన్చార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు శేఖర్‌ను మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. టిడిపి నాయకులపై జరిగిన ఈ దాడిని పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తూ, ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను డిమాండ్ చేశారు.
Admin
DNB News