Wednesday, 17 June 2026 01:52:22 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

కర్నూలు నగరంలో వార్డుల పునర్విభజన ముసాయిదా విడుదల..

Date : 19 May 2026 10:22 AM Views : 47

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 52 ఎన్నికల వార్డులను 68 వార్డులుగా పునర్విభజన చేయడానికి సంబంధించి ప్రతిపాదిత ముసాయిదాను నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సోమవారం విడుదల చేశారు. కమిషనర్ క్యాంపు కార్యాలయంలో పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి ముసాయిదా ప్రతులను ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 24న జారీ చేసిన జీవో నెం.65 ప్రకారం వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నగర జనాభా 4,77,718గా ఉండగా, భౌగోళిక పరిస్థితులు, పరిపాలనా సౌలభ్యం, స్థానిక అవసరాలను పరిగణనలోకి తీసుకొని ముసాయిదా రూపొందించినట్లు చెప్పారు. ప్రతిపాదిత ముసాయిదాలో కర్నూలు నియోజకవర్గానికి 42 వార్డులు, పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు అర్బన్ పరిధికి 22 వార్డులు, కోడుమూరు నియోజకవర్గ పరిధికి 4 వార్డులు కేటాయించినట్లు వెల్లడించారు. వార్డుల సరిహద్దులతో కూడిన ముసాయిదాను నగరపాలక సంస్థ కార్యాలయం, కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయాలు, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల నోటీసు బోర్డులపై ప్రదర్శించినట్లు తెలిపారు. ముసాయిదాపై ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు తమ సూచనలు, సలహాలు, అభ్యంతరాలను ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగానికి వ్రాతపూర్వకంగా సమర్పించాలని కమిషనర్ కోరారు. ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా తుది వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జీ సిటీ ప్లానర్ వై.వి. వెంకటరమణ, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, సూపరింటెండెంట్ సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: