DNB News - ఆంధ్రప్రదేశ్ / : డోన్ పట్టణంలో శాసనసభ్యులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మను కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరపు (మన్నే) సుబ్బారెడ్డిని కలసి ఫిబ్రవరి 5వ తేదీన జరగబోయే ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. కర్నూలు పట్టణంలో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ను, అలాగే కేడిసిసి బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి ప్రమాణస్వీకారానికి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించరు.
Admin
DNB News