DNB News - ఆంధ్రప్రదేశ్ / : భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం గూడూరు మండలంలోని పొన్నకల్ గ్రామానికి చెందిన బీజేపీ గూడూరు మండల అధ్యక్షులు కురువ వెంకటేష్ గడ్డివాములను శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేసిన ఘటన బాధాకరమని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పేర్కొన్నారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు పరిగెల మురళీకృష్ణతో కలిసి ఆదివారం పొన్నకల్ గ్రామానికి వెళ్లి కురువ వెంకటేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి, పార్టీ తరఫున పూర్తి అండగా ఉంటామని భరోసా కల్పించారు. అలాగే ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మురళీకృష్ణ అభిమానులు పాల్గొన్నారు.
Admin
DNB News