DNB News - ఆంధ్రప్రదేశ్ / : భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధ సంఘమైన భారతీయ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ (బి ఎం ఎస్ ఆర్ యు ) రాష్ట్ర అధ్యక్షుడిగా, బిఎంఎస్ నాయకులు పప్పుల సురేష్ నియమితులయ్యారు.కార్మిక ఉద్యమంలో ఆయనకున్న అనుభవం, అంకితభావం,గుర్తిస్తూ సంఘం రాష్ట్ర సంఘటన కార్యదర్శి రామ్మోహన్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూర్పు రాంరెడ్డి ఈ కీలక బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా పప్పుల సురేష్ మెడికల్ రిప్రజెంటేటివ్‌లు,సేల్స్ రిప్రజెంటేటివ్‌లు , ఫార్మా రంగ ఉద్యోగులు నేడు అనేక సమస్యలనుఎదుర్కొంటున్నారని , .పెరుగుతున్న పనిభారం,ఉద్యోగ భద్రత లేకపోవడం, లక్ష్యాల పేరుతో మానసిక ఒత్తిళ్లు,కార్మిక చట్టాల అమలులో లోపాలు వంటి అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఉద్యమాన్ని నిర్మించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. అలాగే “ఉద్యోగుల హక్కుల పరిరక్షణే తన ప్రధాన లక్ష్యం అన్నారు. .రాష్ట్రంలోని ప్రతి మెడికల్ మరియు సేల్స్ ఉద్యోగికి (బి ఎం ఎస్ ఆర్ యు )అండగా నిలుస్తుందని , సంఘటిత శక్తితో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి, వారి గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన హక్కులను సాధించేందుకు నిరంతరంపోరాడుతామన్నారు. .పప్పుల సురేష్ నియామకంపై రాష్ట్రవ్యాప్తంగా బి ఎం ఎస్ నాయకులు,కార్మిక సంఘ ప్రతినిధులు, మెడికల్ మరియు సేల్స్ రంగ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.ఆయన నాయకత్వంలో(బి ఎం ఎస్ ఆర్ యు )మరింత బలోపేతమై ఉద్యోగుల సంక్షేమం కోసం సమర్థవంతంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిదంగా ప్రధాన కార్యదర్శి గా సిహెచ్ . రాఘవేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు గా వి. డిజగదీష్, జాయింట్ సెక్రటరీ గా మహేష్, కోశాధికారి గా క్యాతం శ్రీనివాస్ ఎన్నికయ్యారు.ఈ నియామకానికి సహకరించిన బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు కలాల్ శ్రీనివాస్ రాష్ట్ర నాయకులకు వారంతా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
Admin
DNB News