DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని మండలం విరుపాపురం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రాణ పునః ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా స్పందించిన గుడిసె ఆది కృష్ణమ్మ, స్వామివారి ఆశీస్సులతో కార్యక్రమం విజయవంతంగా జరగాలని ఆకాంక్షిస్తూ తనవంతుగా రూ.5,000/- విరాళాన్ని అందజేశారు. ధార్మిక కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ముందుండే నాయకురాలిగా, ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్న గుడిసె ఆది కృష్ణమ్మ సేవలను స్థానికులు అభినందించారు.
Admin
DNB News