DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని కౌడల్‌పేటకు చెందిన కోడి గణేష్ (31) గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. భార్య, ఇద్దరు పసిపిల్లలతో సంతోషంగా సాగుతున్న గణేష్ సంసారంలో విధి వింత నాటకం ఆడింది. నిన్న రాత్రి తన తమ్ముడితో కలిసి బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఒక్కసారిగా ఛాతీ నొప్పి రావడంతో గణేష్ కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, ఆసుపత్రికి చేరుకునేలోపే ఆయన ప్రాణాలు విడిచారు. యాదవగిరి షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న గణేష్ అకాల మరణంతో, ఆయన ఇద్దరు చిన్నారులు తండ్రి నీడను కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
Admin
DNB News