DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఫిబ్రవరి 7వ తేదీన ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి తెలిపారు. సోమవారం కలుగొట్ల గ్రామంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఎమ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ జయ నాగేశ్వర రెడ్డి, ఆదోని ఇంచార్జి సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి సీఎం పర్యటనకు సంబంధించి హెలిప్యాడ్, ప్రజావేదిక, రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించేందుకు అనువైన ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, ఫిబ్రవరి 7వ తేదీన కలుగొట్ల గ్రామంలో నిర్వహించనున్న పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజావేదిక కార్యక్రమం, రైతుల పొలాల పరిశీలన, రైతులతో ప్రత్యక్ష సంభాషణ వంటి ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమాలు ఎటువంటి అవాంతరాలు లేకుండా సాఫీగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పర్యటనలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ జయ నాగేశ్వర రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు గుడిసె కృష్ణమ్మ, ఇంచార్జి సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, డీఎంహెచ్ఓ భాస్కర్, ఆర్ అండ్ బి ఎస్.ఈ. మహేశ్వర్ రెడ్డి, డీపీఓ భాస్కర్, డీఎస్‌ఓ రాజా రఘువీర్, ఏడీ సర్వే మణికన్నన్, జేడీ అగ్రికల్చర్ వరలక్ష్మి, తహసీల్దార్ శ్రీనివాసులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News