Tuesday, 28 April 2026 03:02:06 PM
# దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ అధినేతకు పితృ వియోగం.. # రాత్రి వేళల్లో కర్నూలులో కట్టుదిట్టమైన పోలీసింగ్ – ప్రజల భద్రతే లక్ష్యం.. # కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ఆగ్రహం – తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్... # పట్టుదలతో పతకాల వర్షం… అంతర్జాతీయ వేదికపై ఆదోని మహిళల ఘనత... # మండల వ్యాప్తంగాఘనంగా గులాబీ జెండా రెపరెపలుబీఆర్ఎస్ పార్టీఆవిర్భావ దినోత్సవ వేడుకలు # ఆదోని జిల్లా కోసం 163వ రోజు దీక్ష – హామీ కోసం జేఏసీ ఆగ్రహం.. # పొరంబోకు భూమిపై రాజకీయ గేమ్… హెచ్చరిక బోర్డు ధ్వంసం కలకలం.. # 121 ఫిర్యాదుల స్వీకరణ – చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తాం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ # పెట్రోల్, డీజిల్ కొరత లేదు – ఆందోళన వద్దు, అదనపు కొనుగోళ్లు చేయొద్దు: కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక.. # ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం సామాన్య ప్రజలు బారులు తీరడం # టిఆర్ఎస్ జండా ఆవిష్కరణ # హిందూధర్మం అంటే మతం కాదు, జీవన విధానం. .. # జై వడ్డె ఓబన్న జై వడ్డెర # వైసీపీకి భారి షాక్ – బీజేపీలోకి 30 కుటుంబాల ఘన చేరిక.. # కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం # భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ # నిజం చెప్పడం వల్ల అసౌకర్యం కలిగినా బాధ్యతతో వ్యవహరించాలి – సీనియర్ జర్నలిస్టు మగ్ధుం భాష... # హరీశ్ రావు ని శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామస్థుల ఆహ్వానం # ఆదోని భూ మోసం బహిర్గతం – బాధితులకు న్యాయం కోసం పోరాటం.. గుడిసె కృష్ణమ్మ # కర్నూలు ఎస్పీని కలిసిన నూతన సివిల్ జడ్జి మహమ్మద్ అజామ్ – అభినందనలు తెలిపిన విక్రాంత్ పాటిల్..

కర్నూలు ఎస్పీని కలిసిన నూతన సివిల్ జడ్జి మహమ్మద్ అజామ్ – అభినందనలు తెలిపిన విక్రాంత్ పాటిల్..

Date : 26 April 2026 11:54 AM Views : 26

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నూతనంగా జూనియర్ సివిల్ జడ్జి (JCJ)గా ఎంపికైన మహమ్మద్ అజామ్, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల వెలువడిన ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీసెస్ ఫలితాలలో ప్రతిభ కనబరిచి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన అజామ్‌ను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కృషి, పట్టుదలతో సాధించిన ఈ విజయాన్ని ప్రశంసిస్తూ, న్యాయవ్యవస్థలో ప్రజలకు న్యాయం అందించే దిశగా సేవలు అందించాలని సూచించారు. తండ్రి పోలీస్ శాఖలో సేవలందిస్తుండగా, కుమారుడు న్యాయవ్యవస్థలో ప్రతిష్టాత్మక స్థానం పొందడం గర్వకారణమని కొనియాడారు. ఇది సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహమ్మద్ అజామ్ నేపథ్యం: కర్నూలు రూరల్ మండలం బి. తాండ్రపాడు గ్రామానికి చెందిన మహమ్మద్ అజామ్, కర్నూలు జోనల్ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అల్లాబకాష్, షేకూన్ దంపతుల కుమారుడు. విద్యార్హతలు: ప్రాథమిక విద్యను కర్నూలులోనే పూర్తి చేసిన అజామ్, హైదరాబాద్‌లోని పెండేకంటి లా కాలేజీలో ఎల్.ఎల్.బి (LLB), విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ఎల్.ఎల్.ఎమ్ (LLM) పూర్తి చేశారు. 2025 నోటిఫికేషన్‌లో హైకోర్టు నిర్వహించిన రాత పరీక్షలు మరియు ఇంటర్వ్యూలలో ప్రతిభ కనబరిచి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై విజయాన్ని సాధించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది మహమ్మద్ అజామ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :