DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మే–2026 నెలకు “మన లక్ష్యం ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్” అనే థీమ్‌తో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సి.ఎం. నయీమ్ అహ్మద్ మరియు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సందీప్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే పర్యావరణ నష్టాలను వివరించి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ వస్తువులను ఉపయోగించాలని సూచించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Admin
DNB News