DNB News - ఆంధ్రప్రదేశ్ / : భారత జనగణన–2027 తొలి దశలో భాగంగా నిర్వహించనున్న గృహ జాబితా (House Listing) మరియు గృహ జనగణన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా మరియు చార్జ్ స్థాయి అధికారులకు మూడు రోజులపాటు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమం G. Pullaiah Engineering & Technology Collegeలో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు. జనగణన ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహించడం అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఇంటి వివరాలను సక్రమంగా నమోదు చేయడం ద్వారా ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు అవసరమైన ఖచ్చితమైన డేటా అందుతుందని తెలిపారు. అధికారులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించి, జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా గృహ జాబితా మరియు జనగణన కార్యక్రమాలను సమయపాలనతో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
Admin
DNB News