DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఈరోజు ఉదయం తిరుపతి జిల్లా లో చిన్నగొట్టిగల్లు బీసీసీ ను సీనియర్ జనరల్ మేనేజర్ డా. A V V ప్రసాద్ మరియు డిప్యూటీ జనరల్ మేనేజర్ డా. పాండ్య రాజన్ ప్రారంభ పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో చిన్న గొట్టిగల్లు బీసీసీ పరిధిలో గల ఏజెంట్ లు మరియు చెరుకువారి పల్లి బీసీసీ పరిధిలో గల ఏజెంట్ లు సుమారు 100 మంది హాజరైనారు. వారికీ మన డెయిరీ యొక్క విధి విధానాలు, పశు వైద్యం నిమిత్తం సంచార వాహనాలు ద్వారా మెడికల్ క్యాంపు లు, మినరల్ మిక్సర్ మరియు పశు ధానా సదుపాయాలు క్లుప్తంగా వివరించడం జరిగింది. పేమెంట్ ప్రతి 15 రోజులు కు నేరుగా రైతులు యొక్క వ్యక్తి గత ఖాతాలో జమ చేయటకు సంబందించిన మెషినరి సాఫ్ట్ వేర్ విధానాలు ఏజెంట్ లకు వివరించడం జరిగింది. తేది 01.04.2026 నుండి చిన్న గొట్టిగల్లు బీసీసీ ప్రారంభం అవుతుంది కావున రైతులు అందరు పాల పెరుగుదలకు సహకరించమని కోరడం జరిగింది.
Admin
DNB News