DNB News - ఆంధ్రప్రదేశ్ / : తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం పొందిన తొలి తెలుగు కవయిత్రి అటుకూరి మొల్ల మాంబ జయంతిని పురస్కరించుకుని కర్నూలు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నోరుల్ కమర్ కవయిత్రి మొల్లమాంబ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మొల్లమాంబ తెలుగు సాహిత్యానికి చేసిన సేవలు అపారమని, రామాయణాన్ని సరళమైన తెలుగు భాషలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
DNB News