DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆధ్వర్యంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశం ఈరోజు విజయవాడలో ఘనంగా జరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి అసోసియేషన్ ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు మరియు ఏపీ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు ఆముదాలవలస నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సాఫ్ట్‌బాల్ క్రీడాభివృద్ధికి అసోసియేషన్ తీసుకుంటున్న చర్యలను అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాబోయే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల నిర్వహణ, క్రీడాకారులకు మెరుగైన శిక్షణ సదుపాయాలు, కోచ్‌ల అభివృద్ధి కార్యక్రమాలు వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. జిల్లాల వారీగా క్రీడా శిబిరాలు నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించాలనే నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, జిల్లాల ప్రతినిధులు, క్రీడా నిర్వాహకులు పాల్గొన్నారు.
Admin
DNB News