DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ డెమొక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ (ఏపీడీజేయూ) తరపున సీనియర్ జర్నలిస్టు తెలుగు ఈరన్న గారి కుమారుడి వివాహ వేడుకకు హాజరైన యూనియన్ నాయకులు, సీనియర్ జర్నలిస్ట్ మగ్దుమ్, నర్సప్ప,గౌస్ నూతన వధూవరులను శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జర్నలిస్టు కుటుంబాల్లో ఇలాంటి శుభకార్యాలు ఆనందాన్ని పంచుతాయని పేర్కొన్నారు. తెలుగు ఈరన్న గారు జర్నలిజం రంగంలో చేసిన సేవలను కొనియాడుతూ, వధూవరులు ఆనందంగా, ఆయురారోగ్యాలతో జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘ నాయకులు, సభ్యులు, పాల్గొన్నారు.
Admin
DNB News