Monday, 15 June 2026 01:40:37 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవడం దుర్మార్గపు ఆలోచన – మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి..

Date : 09 February 2026 05:36 PM Views : 151

DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవడం కూటమి ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచన అని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. సోమవారం మండల పరిధిలోని రాంపురం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల ప్రసాదం లడ్డూ తయారీలో వాడే నేయిలో జంతు కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు మాంసం కలిసిందని కూటమి నాయకులు తప్పుడు ఆరోపణలు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలను వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలైన NRDI, NDDB ల్యాబ్‌లు ఎలాంటి కల్తీ జరగలేదని స్పష్టం చేసినా కూడా కూటమి నాయకులు అబద్ధాల రాజకీయాలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై స్వామివారి భక్తులు కూటమి నాయకులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ప్రజల దృష్టిలో పూర్తిగా నమ్మకం కోల్పోయిన చంద్రబాబు నాయుడు తన అబద్ధాలను నిజాలుగా చూపించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగా కుట్ర రాజకీయాలకు తెరలేపారని మండిపడ్డారు. ప్రజలకు, స్వామివారి భక్తులకు క్షమాపణ చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు, సుప్రీంకోర్టు ఆదేశాలతో జరిగిన దర్యాప్తును సైతం తప్పుపట్టడం, ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు చేయడం, ఇళ్లను తగలబెట్టడం అత్యంత దారుణమని అన్నారు. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ప్రజలకు, శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి డిమాండ్ చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :