DNB News - ఆంధ్రప్రదేశ్ / : భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షురాలిగా పద్మావతి ఎన్నికైన సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందవరం నాయకులు గురురాజ్ దేశాయ్ , పట్టణ అధ్యక్షులు మరియు కౌన్సిలర్ దయ సాగర్ , మహిళా నాయకురాలు మాధవి లత కలిసి పద్మావతికి శాలువా కప్పి, పూలమాలలు వేసి సత్కరించారు. జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన పద్మావతి తనపై నమ్మకం ఉంచి ఈ పదవిని అప్పగించిన పార్టీ నాయకత్వానికి, అలాగే సన్మానించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామన్న గౌడ్, బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు బి.ఎన్.ఎల్. నారాయణ, మండల ఉపాధ్యక్షుడు కురువ బడే సాబ్, ఎమ్మిగనూరు పట్టణ ప్రధాన కార్యదర్శి చరణ్, న్యాయవాది వడ్డే ఉరుకుందు, రజక సంఘం అధ్యక్షుడు హనుమన్న, నందవరం సీనియర్ నాయకులు, ఎస్సీ మోర్చా మాజీ అధ్యక్షులు శివ, వీరేష్, లోకేష్, కాసిం, రవి తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News