Tuesday, 28 April 2026 02:59:52 PM
# దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ అధినేతకు పితృ వియోగం.. # రాత్రి వేళల్లో కర్నూలులో కట్టుదిట్టమైన పోలీసింగ్ – ప్రజల భద్రతే లక్ష్యం.. # కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ఆగ్రహం – తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్... # పట్టుదలతో పతకాల వర్షం… అంతర్జాతీయ వేదికపై ఆదోని మహిళల ఘనత... # మండల వ్యాప్తంగాఘనంగా గులాబీ జెండా రెపరెపలుబీఆర్ఎస్ పార్టీఆవిర్భావ దినోత్సవ వేడుకలు # ఆదోని జిల్లా కోసం 163వ రోజు దీక్ష – హామీ కోసం జేఏసీ ఆగ్రహం.. # పొరంబోకు భూమిపై రాజకీయ గేమ్… హెచ్చరిక బోర్డు ధ్వంసం కలకలం.. # 121 ఫిర్యాదుల స్వీకరణ – చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తాం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ # పెట్రోల్, డీజిల్ కొరత లేదు – ఆందోళన వద్దు, అదనపు కొనుగోళ్లు చేయొద్దు: కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక.. # ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం సామాన్య ప్రజలు బారులు తీరడం # టిఆర్ఎస్ జండా ఆవిష్కరణ # హిందూధర్మం అంటే మతం కాదు, జీవన విధానం. .. # జై వడ్డె ఓబన్న జై వడ్డెర # వైసీపీకి భారి షాక్ – బీజేపీలోకి 30 కుటుంబాల ఘన చేరిక.. # కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం # భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ # నిజం చెప్పడం వల్ల అసౌకర్యం కలిగినా బాధ్యతతో వ్యవహరించాలి – సీనియర్ జర్నలిస్టు మగ్ధుం భాష... # హరీశ్ రావు ని శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామస్థుల ఆహ్వానం # ఆదోని భూ మోసం బహిర్గతం – బాధితులకు న్యాయం కోసం పోరాటం.. గుడిసె కృష్ణమ్మ # కర్నూలు ఎస్పీని కలిసిన నూతన సివిల్ జడ్జి మహమ్మద్ అజామ్ – అభినందనలు తెలిపిన విక్రాంత్ పాటిల్..

కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ఆగ్రహం – తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్...

Date : 28 April 2026 11:41 AM Views : 8

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ కొరతపై భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితులను సీపీఎం తీవ్రంగా ఖండించింది. సోమవారం కర్నూలు నగరంలోని ఇందిరా గాంధీ నగర్‌లో ఉన్న సుందరయ్య భవన్‌లోని సీపీఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.ఎస్. రాధాకృష్ణ, ఎం.డి. ఆనంద్ బాబు, టి. రాముడు మాట్లాడారు. జిల్లాలో అనేక పెట్రోల్ బంకుల వద్ద సరఫరా నిలిచిపోవడం, భారీ క్యూలు ఏర్పడడం, అధిక ధరలు వసూలు చేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ కొరత సహజం కాదని, కొందరు వ్యాపార వర్గాలు లాభాపేక్షతో కృత్రిమంగా సృష్టిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఈ పరిస్థితి వల్ల సాధారణ ప్రజలు, రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రోజువారీ కార్యకలాపాలు స్తంభించిపోతున్నాయని అన్నారు. అత్యవసర సేవలపై కూడా ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ఏడు రోజులకు సరిపడా సుమారు 13.5 లక్షల లీటర్ల ఇంధన నిల్వలు ఉన్నాయని ప్రకటించగా, ప్రస్తుతం బంకులు మూతపడడం పరిస్థితి మరింత అనుమానాలకు దారి తీస్తోందన్నారు. మరోవైపు సమస్య లేదని మంత్రి చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. పెట్రోల్, డీజిల్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలి కృత్రిమ కొరత సృష్టిస్తున్న డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి ధరల నియంత్రణను కట్టుదిట్టంగా అమలు చేయాలి నిల్వలు, సరఫరాపై ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేయాలి సరఫరా వివరాలను పారదర్శకంగా ప్రజలకు వెల్లడించాలి ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే ప్రజలతో కలిసి సీపీఎం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని నాయకులు హెచ్చరించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :