Wednesday, 17 June 2026 02:48:53 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

అక్రమ అరెస్ట్‌పై కోనేరు నాగేంద్ర ప్రసాద్ ఆగ్రహం--“FIR లేకుండా జైలు శిక్ష.. దేశ చరిత్రలోనే అరుదైన ఘటన..

Date : 18 May 2026 10:41 AM Views : 85

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని శ్రీ కోతులాబావి ఆంజనేయస్వామి ఆలయ ప్రహరీ వ్యవహారానికి సంబంధించి తనపై జరిగిన అరెస్ట్ పూర్తిగా అక్రమమని మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేంద్ర ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో పలు సంచలన ఆరోపణలు చేశారు. ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న “శ్రీ హనుమ కరసేవ” కార్యక్రమం సందర్భంగా అదే రోజు ఉదయం 5:30 గంటలకు ఎమ్మిగనూరు సీఐ కంబగిరి రాముడు తన సిబ్బందితో కలిసి తనను అరెస్ట్ చేశారని తెలిపారు. అరెస్ట్ అనంతరం గౌరవ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా నేరుగా జైలుకు తరలించారని, ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఆదోని సబ్ జైలు అధికారులకు తాను ఈ విషయాన్ని వివరించినప్పటికీ తనను కర్నూలు జిల్లా జైలుకు తరలించారని చెప్పారు. అక్కడి జైలు ఉన్నతాధికారులు FIR, ఫిర్యాదు, కోర్టు ఆదేశాలు లేకుండా కేవలం బైండోవర్ కేసు ఆధారంగా ఎమ్మిగనూరు తహసీల్దార్ శ్రీనివాసులు ఆరు నెలల శిక్ష విధించడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారని తెలిపారు. జైలు అధికారుల సూచనల మేరకు తన న్యాయవాదులు చర్యలు తీసుకోవడంతో మూడో రోజుకే విడుదలైనట్లు పేర్కొన్నారు. ఒక రాజకీయ నాయకుడిని సంతోషపెట్టేందుకు కోతులాబావి వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని తనపై కుట్రపూరితంగా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని ఆరోపించారు. “FIR లేకుండా, రిమాండ్ రిపోర్ట్ లేకుండా, మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచకుండా జైలు శిక్ష విధించడం దేశంలో ఎక్కడా జరగలేదు. టెర్రరిస్ట్‌లకు కూడా ఇలాంటి వ్యవహారం ఉండదు. బ్రిటిష్ పాలనలో కూడా ఇలాంటి అక్రమాలు జరగలేదు” అని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి N. Chandrababu Naidu జిల్లా జడ్జితో న్యాయ విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అక్రమాలకు పాల్పడిన అధికారులను శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించాలని కోరారు. ఈ వ్యవహారంపై తాను న్యాయపోరాటం కొనసాగిస్తానని, ఎమ్మిగనూరులో ఇటువంటి ఆరాచకాలను సాగనివ్వబోనని కోనేరు నాగేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: