DNB News - ఆంధ్రప్రదేశ్ / : వైయస్సార్సీపి గ్రామస్థాయిలో పటిష్ట పరిచేందుకు అంకిత భావంతో పనిచేయాలని వైఎస్ఆర్ సీపీ టెక్కలి నియోజకవర్గం ఇంచార్జ్ పేరాడ తిలక్ కోరారు. జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా కురమాన ఉత్తంకుమార్,బూత్ కమిటీల జిల్లా ప్రధాన కార్యదర్శిగా అంబోడి విష్ణు లను నూతనంగా నియమించడంతో వారు తిలక్ గారిని మంగళవారం టెక్కలి కార్యాలయంలో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు పాటుపడాలని సూచించారు ఈ కార్యక్రమంలో నందిగాం ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తి,వైఎస్ఆర్ సీపీ నాయకులు జడ్యాడ జయరాం, చిన్ని జోగారావు,అక్కురాడ లోకనాదం, అంబోడి సురేష్, కురమాన,కురమాన త్రివేణ్ కుమార్,కురమాన ధనుంజయ,ఇప్పిలి నాగభూషణం రావు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
DNB News