DNB News - ఆంధ్రప్రదేశ్ / : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మహిళా పోలీసులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) హుస్సేన్ పీరా ముఖ్య అతిథిగా హాజరై మహిళా పోలీసులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా పోలీసుల సేవలు సమాజ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. మహిళా దినోత్సవ వారోత్సవాల్లో నిర్వహించిన ఆటల పోటీలలో విజేతలైన మహిళా సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశామని తెలిపారు. మహిళలు ఉత్సాహంతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ క్రీడల్లో కూడా ప్రతిభ చూపుతున్న ఆర్‌ఎస్‌ఐ కల్పనను శాలువా, మెమెంటోతో ప్రత్యేకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ ఏఓ విజయలక్ష్మీ, డిటిఆర్బి సిఐ ఆదిలక్ష్మీ, ఆర్‌ఐ నారాయణ, ఆర్‌ఎస్‌ఐలు కల్పన, మహాలక్ష్మీ, మహిళా పోలీసు సిబ్బంది, శక్తి టీం సభ్యులు, మహిళా హోంగార్డులు పాల్గొన్నారు.
Admin
DNB News