DNB News - ఆంధ్రప్రదేశ్ / : పదవి వీరమణ పొందిన పోలీసు అధికారులను ఘనంగా సన్మానిస్తూ వారి సేవలను ప్రశంసించారు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ . సుధీర్ఘకాలం పోలీసుశాఖలో నిబద్ధతతో పని చేసి పదవివీరమణ పొందడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. కర్నూలు డిటిసి ఎస్సై జి. మల్లికార్జున, ఆదోని పిసిఆర్ ఎస్సై కె.పి. ప్రహల్లాద, కర్నూలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బి. రంగడు గురువారం పదవివీరమణ పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్‌ను శాలువాలు కప్పి, పూలమాలలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. పదవీవిరమణ అనంతరం కుటుంబాలతో సంతోషంగా గడపాలని, ఎలాంటి సమస్యలు ఎదురైనా నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ కృష్ణమోహన్, స్పెషల్ బ్రాంచ్ సీఐ మధుసుధన్ రావు, ఆర్‌ఐలు నారాయణ, జావేద్, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు, పదవివీరమణ పొందిన వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్థలం: జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు
Admin
DNB News