Saturday, 13 June 2026 07:10:54 AM
# రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి.. # ISPL టోర్నమెంట్‌లో సందడి చేసిన ఎమ్మెల్యే పార్థసారథి.. క్రీడాకారులకు ప్రోత్సాహం.. # కేంద్ర సబ్సిడీ రుణ పథకాలతో స్వయం ఉపాధి అవకాశాలు పెంచుకోండి: ఎమ్మెల్యే డా. పార్థసారథి.. # ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేత # రేషన్ షాపుల్లో పూర్తి స్థాయిలో సరుకుల పంపిణీ చేయాలి: డీవైఎఫ్‌ఐ.. # కలకోవ గ్రామంలో నూతన భవన నిర్మాణ కార్మిక సంఘం ఏకగ్రీవ ఎన్నిక # చెరువుల ఆక్రములపై చర్యలు తీసుకోవాలి. మత్స్య సహకార సంఘం డిమాండ్ # ఆదోని రెండో మండలానికి ప్రత్యేక అధికారులను నియమించాలి: MHPS నూర్ అహ్మద్... # బాధిత కుటుంబలను పరామర్శించిన - మాజీ స్పీకర్ తమ్మినేని # జలధార జలహారతితో చెరువులకు పునర్జీవం – శ్రామికులకు కలెక్టర్ డా. ఏ.సిరి అవగాహన...

కరీంనగర్ జిల్లా సైకిల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా సైక్లింగ్ ర్యాలీ

Date : 04 June 2026 11:56 AM Views : 14

DNB News - ఆంధ్రప్రదేశ్ / : సైక్లింగ్ ఆరోగ్యంపై చక్కటి ప్రభావం చూపుతుందని, సైక్లింగ్ చేయడం ద్వారా అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటామని మరియు రోజు వారి కార్యకలాపాలను చాలా ఉషారుగా చేయగలుగుతామని కరీంనగర్ జిల్లా అటవి అధికారి ఎస్.సత్యనారాయణ విజయ్ కుమార్ ఏసీపీ రూరల్, కరీంనగర్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ చైర్మన్ అల్ఫోర్స్ వి.నరేందర్ రెడ్డి అధ్యక్షులు డాక్టర్ కెప్టెన్ బి.మధుసూదన్ రెడ్డి మరియు ఇతర ప్రతినిధులతో కలిసి కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ నుండి ఎలగందుల ఖిల్లా వరకు ఏర్పాటు చేసినటువంటి సైక్లింగ్ ర్యాలీని జెండా ఊపి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్రదేశాలైన ఫ్రెన్స్, జర్మనిలో సైక్లింగ్ కు చాలా క్రేజ్ ఉందని మరియు ప్రాధాన్యత ఇస్తున్నారని తద్వారా వారు వనరులను భావి తరాలకు సంరక్షించడమే కాకుండా పర్యావరణాన్ని సైతం కాపాడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని వారు చెప్పారు ప్రతి ఒక్కరూ సైక్లింగ్ చేయడాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలని మరియు దేశ ఆర్థికాభివృద్ధికి చేయుతనివ్వాలని వారు సూచించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని సైక్లింగ్ అలవాటు చేసుకుని ఆదర్శంగా నిలవాలని చెప్పారు. విజయ్ కుమార్, రూరల్ ఏసీపి మాట్లాడుతూ సైక్లింగ్ చేయడం వలన గుండె సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుందని మరియు ఇంధనం కాపాడు కాపాడుకోగలుగుతామని తద్వారా దేశ జాతీయ ఆదాయం పై ప్రభావం చూపుతుందని చెప్పారు. అసోసియేషన్ చైర్మన్ వి.నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సైక్లింగ్ చేయడం వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని, బరువు సులభంగా తగ్గుతుందని వారు చెప్పారు. ఒత్తిడి తగ్గించి మానసిక ప్రశాంతత సైతం లభిస్తుందని తెలుపుతూ సైక్లింగ్ అనేది ఒక అద్భుతమైన ఏరోబిక్ వ్యాయామం అని గంటల్లో కేలరీలను కరిగిస్తుందని వారు చెప్పారు. కరీంనగర్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కెప్టెన్ బి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎన్నో చైతన్యవంతమైన కార్యక్రమాలను నిర్వహించడం జరిగినదని మరియు పోటీలను నిర్వహించి సైక్లింగ్ పట్ల క్రేజ్ పెంపొందించగలగాని చెప్పారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని చాలా చక్కటి స్పందన లభించింది అని మరియు పాల్గొన్న క్రీడాకారులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా ఉత్సాహంగా కొనసాగిన ఈ ర్యాలీలో నినాదాలు చేసి చైతన్య కల్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు వి. జగదీశ్వర చారి ఎం. అరవింద్ బాబు మధు తిరుపతి ఏం.మహేందర్ అఖిల్ ఏజే పెడల్స్ ప్రతినిధి, తల్లిదండ్రులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :