DNB News - ఆంధ్రప్రదేశ్ / : కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఉపాధి హామీ పథకం అమలుపై జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఎంపిడిఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి పనుల పురోగతి, కూలీలకు సమయానికి వేతనాల చెల్లింపు, పనుల నాణ్యత, పారదర్శకతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి గ్రామంలో పథకం సమర్థవంతంగా అమలవ్వాలని, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Admin
DNB News